AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RamGopal Varma: పుష్ప ట్రైలర్‌పై స్పందించిన ఆర్జీవీ.. ఏం చెప్పారంటే..

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. రష్మిక మందన పుష్పరాజ్‌ ప్రియురాలు శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. మలయాళ నటుడు ఫాహిద్‌ ఫాజిల్‌, అనసూయ, అజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

RamGopal Varma: పుష్ప ట్రైలర్‌పై స్పందించిన ఆర్జీవీ.. ఏం చెప్పారంటే..
Basha Shek
|

Updated on: Dec 07, 2021 | 8:46 AM

Share

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన పుష్పరాజ్‌ ప్రియురాలు శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. మలయాళ నటుడు ఫాహిద్‌ ఫాజిల్‌, అనసూయ, అజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత బన్నీ- సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, గ్లింప్స్‌, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప’ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇప్పటివరకు ఎంతో స్టైలిష్‌గా కనిపించిన బన్నీ ఈ సినిమాలో ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతున్న ఈ ట్రైలర్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు.

బన్నీ మాత్రమే చేయగలడు.. ట్రైలర్‌ యూట్యూబ్‌ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆర్జీవి ‘ ఇలాంటి రియలిస్టిక్‌ పాత్రలో నటించడానికి భయపడని సూపర్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాత్రమే’ అని ప్రశంసలు కురిపించారు. ఇక సినిమాలో బన్నీ చెప్పిన ‘పుష్ప అంటే ఫ్లవర్‌ కాదు.. ఫైర్‌’ డైలాగ్‌ను కూడా ట్వీట్‌లో రాసుకొచ్చాడీ డైరెక్టర్‌. కాగా రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ మొదటి భాగం డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మి్స్తోన్నీ ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:

Manasanamha: ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన తెలుగు సినిమా.. కృతజ్ఞతలు తెలిపిన మనసానమః మూవీ టీమ్..

Sathyaraj: కట్టప్ప ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరి కన్నుమూత..

Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ !.. ఆహ్వానితుల జాబితా ఇదే!

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!