Ram Charan: చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్సీ 15 ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఈ అనౌన్స్ డేట్ కూడా తెలిసిపోయింది. ఈ సినిమాపై అంచనాలు వేరేలెవల్. అందులోనూ డైరెక్టర్ శంకర్ కావడంతో మరింత హైప్ పెరిగిపోయింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇందులో చరణ్, తారక్ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్.. చరణ్.. చరణ్! ఇదే నేమ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆర్సీ15 ఫస్ట్ లుక్‌కు.. టైటిల్ అనౌన్స్మెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి! బాబు బర్త్‌డే రోజే ఈ ఈగర్‌కు చెక్ పడనుంది కాబట్టి. అందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది కాబట్టి! అందర్లోనూ తెలియని ఉత్సాహం విరుచుకుపడుతోంది కాబట్టి! చెర్రీ ఫ్యాన్స్ ఇక ఆగమన్నా ఆగరు కాబట్టి.!. నిజమే.. ఆర్సీ 15 ఫస్ట్ లుక్ రాబోతుంది. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఈ అనౌన్స్ డేట్ కూడా తెలిసిపోయింది. ఈ సినిమాపై అంచనాలు వేరేలెవల్. అందులోనూ డైరెక్టర్ శంకర్ కావడంతో మరింత హైప్ పెరిగిపోయింది.
ఇప్పటికే ఆర్సీ 15 గురించి నెట్టింట సెర్చింగ్ మొదలెట్టారు అభిమానులు. ఫ్యాన్స్ మాత్రం కొద్ది రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ పై ఆరా తీస్తూనే ఉన్నారు. నెట్టింట లీకవుతున్న ఒకటీ అరా ఫోటోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వొచ్చుగా అంటూ.. కనిపించిన ప్రతీ సారి దిల్ రాజును రిక్వెస్ట్ చేస్తున్నారు. నెట్టింట వేడుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ బాధను చూడలేక పోయిన దిల్ రాజు.. తాజాగా ఓ అఫీషియల్ లీక్ ఇచ్చారు.
మార్చ్ 27న అంటే చెర్రీ బర్త్ డే రోజు.. ఆర్సీ15 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ అంటూ చెప్పేశారు. ఇక డేట్ నోట్ చేసుకున్న ఫ్యాన్స్ …ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓ పక్క చెర్రీ బర్త్‌డే పండగ.. అదే రోజు ఆర్సీ ఫస్ట్ లుక్ వేడుక! అంటూ నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు. మరో సారి రామ్ చరణ్ ను .. ఆర్సీ15 హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.




ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చార్మినార్ లో జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మొదటిసారి చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపించనుండడంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
