Game Changer: మెగా ఫ్యాన్స్‌కు ‘డబుల్’ ధమకా.. రెండు పార్టులుగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో గేమ్ ఛేంజర్ ’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు కనీసం ఒక టీజర్, సాంగ్ కానీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి చరణ్‌తో జోడీ కట్టింది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో గేమ్ ఛేంజర్ ’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు కనీసం ఒక టీజర్, సాంగ్ విడుదల చేయకపోవడంతో అభిమానులు రామ్ చరణ్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి ఓ కొత్త వార్త వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇది విన్న అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.’బాహుబలి 2′ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్ బలంగా నాటుకుపోయింది మేకర్స్‌లో. ఆ తర్వాత విడుదలైన కేజీఎఫ్, పుష్ప కూడా రెండ పార్టులుగా, లేటెస్ట్‌గా సలార్ కూడా రెండు పార్టులుగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే బాటలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు కూడా ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలనే ఆలోచనపై సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక వేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానని చెప్పుకోవచ్చు.
అయితే శంకర్ ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 2’ చిత్రాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. దీంతో రామ్ చరణ్ సినిమా రిలీజ్ లేటవుతోంది. మొదటి పార్ట్‌కే ఇంత సమయం తీసుకున్న శంకర్ రెండో పార్ట్ కోసం ఇంకెంత టైమ్ తీసుకుంటాడోనని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు. సుమారు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఆఖరిలో లేదా 2025 ప్రారంభంలో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ఉండనుందని సమాచారం. గేమ్ ఛేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్..
Our IDOL 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan garu papped at airport jet’s off from Hyderabad #GameChanger #GlobalStarRamCharan #RamCharan pic.twitter.com/GzciNy9rGN
— Game Changer (@GameChange69174) December 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.