AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఉపాసన.. సింగిల్ మదర్స్ కోసం కీలక నిర్ణయం..

ఉపాసన మాట్లాడుతూ.. తాను తల్లి కాబోతున్నట్లు తెలిసిన తర్వాత అందరూ తనపై ఎంతో ప్రేమ కురిపించారని.. తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. "ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ఎమోషనల్ జర్నీ.

Upasana Konidela: మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఉపాసన.. సింగిల్ మదర్స్ కోసం కీలక నిర్ణయం..
Upasana Konidela
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2023 | 6:59 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం సీఎస్ఆర్ అపోలో వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. సింగిల్ మదర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం ఆ తల్లులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను సోమవారం ఉపాసన లాంచ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జూబ్లీహీల్స్ లోని అపోలో ఆసుపత్రిలో నిర్వహించగా.. అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించారు ఉపాసన.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. తాను తల్లి కాబోతున్నట్లు తెలిసిన తర్వాత అందరూ తనపై ఎంతో ప్రేమ కురిపించారని.. తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. “ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా ఎమోషనల్ జర్నీ. పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారు.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో పేరెంట్స్ వద్దకు చేర్చడం మా బాధ్యత. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని . పిల్లలకు అనారోగ్యానికి గురయితే ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతారో నాకు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ఇబ్బందిపడడం నేను చూశాను. కొందరు మహిళలు నా దగ్గరకు వచ్చి తమ బాధ చెప్పుకున్నారు. వాళ్లలో సింగిల్స్ మదర్స్ ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ చాలా అవసరం. అందుకే మేము ఓ ప్రకటన చేస్తున్నాము. వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి ఉచితంగా వైద్యం పొందవచ్చు. దీనివల్ల వారికి మేలు లాభం చేకూరుతుందని అనుకుంటున్నాను. వాళ్లను ప్రోత్సాహం ఇస్తాను. ఇది ఎమోషనల్ జర్నీ ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
మందుబాబులకు క్యాబ్ ఫ్రీ.. కాల్ చేస్తే క్షణాల్లోనే సర్వీసులు
మందుబాబులకు క్యాబ్ ఫ్రీ.. కాల్ చేస్తే క్షణాల్లోనే సర్వీసులు
జమ్ముకశ్మీర్‌లో న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైఅలర్ట్‌..
జమ్ముకశ్మీర్‌లో న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైఅలర్ట్‌..