రామ్ కొణిదెెల, పిక్ అదిరిపోలా !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో  ఆర్.ఆర్.ఆర్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

  • Ram Naramaneni
  • Publish Date - 7:45 pm, Thu, 24 September 20
రామ్ కొణిదెెల, పిక్ అదిరిపోలా  !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో  ఆర్.ఆర్.ఆర్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రను బాలీవుడ్  హీరో అజయ్ దేవగణ్ పోషిస్తున్నాడు.  దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకుంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. తాజాగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా  అకౌంట్‌లో కోర మీసంతో తీక్షణంగా చూస్తోన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఎప్పుడూ మీ బెస్ట్ కోసం ప్రయత్నించండి అంటూ సదరు ఫోటోకు హెడ్లైన్ రాసుకొచ్చాడు. ఇక అది చూసిన ఆయన ఫ్యాన్స్ చెర్రీ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న చరణ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఆర్.ఆర్.ఆర్‌ ‌తో పాటు ఆచార్యలోను ఓ కీలకరోల్‌లో రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read :

గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ

ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్