AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : అలాంటి అమ్మాయిని నా జీవితంలోనే చూడలేదు.. ఆ హీరోయిన్ పై రామ్ పొగడ్తలు.. ఇంతకీ ఎవరంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం 'పెద్ది'. ‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'ఆయా షేర్' పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.

Ram Charan : అలాంటి అమ్మాయిని నా జీవితంలోనే చూడలేదు.. ఆ హీరోయిన్ పై రామ్ పొగడ్తలు.. ఇంతకీ ఎవరంటే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: May 18, 2026 | 7:47 PM

Share

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi). డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక తాజాగా ముంబైలో అత్యంత గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ సినిమా విశేషాలను పంచుకుంటూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తామంతా గత రెండేళ్లుగా, దర్శకుడు బుచ్చిబాబు ఐదేళ్లుగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం సినిమాకే పెద్ద పిల్లర్ లాంటిదని అని అన్నారు. రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

హీరోయిన్ జాన్వీ కపూర్ డెడికేషన్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “జాన్వీ లాంటి కష్టపడే మనస్తత్వం ఉన్న నటిని నేను చూడలేదు. మేము ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను కేవలం సెట్స్‌లోనే స్టెప్స్ నేర్చుకుని డాన్స్ చేశాను. కానీ జాన్వీ ముంబైలోనే ఆ స్టెప్స్‌ను 100 సార్లు ప్రాక్టీస్ చేసి నాకంటే అద్భుతంగా చేసింది. ఆమె నిజంగా ఒక టాలెంటెడ్ హీరోయిన్” అని చరణ్ నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవిల కాంబినేషన్ ఎంతటి సంచలనమో.. ఇప్పుడు తామిద్దరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులను, అభిమానులను ఎంతమాత్రం నిరాశపరచదని ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

ఈ సినిమా శారీరకంగా తనకు ఎంతో సవాలుగా నిలిచిందని, నిజమైన కుస్తీ పహిల్వాన్లతో షూటింగ్ చేయడం వల్ల తనకు చిన్న గాయాలైనా, అవన్నీ సినిమా కోసం విలువైనవని చరణ్ పేర్కొన్నారు . “ఇలాంటి అద్భుతమైన కథలు దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయి. నా కెరీర్‌లో ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల తర్వాత నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే అంతటి గొప్ప ఇన్సిపిరేషనల్ కథ ‘పెద్ది'” అని తన తండ్రి చిరంజీవి కూడా చెప్పినట్లు రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి స్టేజ్ పైన ‘చికిరి చికిరి’ సాంగ్‌కు స్టెప్పులేసి సందడి చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

Follow Us