AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చరణ్ అప్పన్న పాత్రలో జీవించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది.

Game Changer: ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Game Changer
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2025 | 11:28 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంక్ర దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషించగా.. నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పన్న పాత్రలో అద్భుతమైన నటనతో జీవించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ.186 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది గేమ్ ఛేంజింగ్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ పై షోలో గేమ్ చేంజర్ కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు గ్రాస్ రాగా, అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు రూ.294 కోట్లు గ్రాస్ వచ్చాయి.

గేమ్ ఛేంజర్ సినిమాకు వారాంతంలో ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అప్పన్న, రామ్ నందన్ పాత్రలకుగానూ చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది. ఎస్జే సూర్య, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజ్, దర్శకుడు శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

“కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్ ఛేంజర్. లవ్ యూ” అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. అప్పన్న పాత్రలో అద్భుతంగా నటించావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకు ప్రాణం పోశావు. నీ ప్రదర్శన చూస్తుంటే ఒక కలలా అనిపించింది. పూర్తిస్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగావు ” అంటూ సాయి దుర్గాతేజ్ పోస్ట్ చేశారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌