Ramcharan: మరదలితో కలిసి స్టెప్పులేసిన చెర్రీ.. మధ్యలో జతకలిసిన ఉపాసన.. ఆకట్టుకుంటోన్న అనుష్పల పెళ్లి వీడియో..
కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని సోదరి అనుష్పల వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉన్న అనుష్పల ఇంటి పెద్దలను ఒప్పించి అతనితో కలిసి ఏడడుగులు నడిచింది
కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని సోదరి అనుష్పల వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉన్న అనుష్పల ఇంటి పెద్దలను ఒప్పించి అతనితో కలిసి ఏడడుగులు నడిచింది. దోమకొండ గడి కోట వేదికగా వీరిద్దరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో కామినేని కుటుంబసభ్యులతో పాటు మెగాఫ్యామిలీ కూడా సందడి చేసింది. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అన్నింటా తానై వ్యవహరించాడు. నిశ్చితార్థం మొదలు దోమ కొండ గడికోటలో పోచమ్మ పండుగ.. సంగీత్.. మెహెందీ ..ఇలా అన్ని వేడుకల్లోనూ సందడి చేస్తూ కనిపించాడు. ఇక ఈ పెళ్లిలో స్పెక్షల్ అట్రాక్షన్ అంటే చరణ్- ఉపాసనల జోడీనే.
కాగా ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రి తన సతీమణి ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి సరదాగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు ఓ పంజాబీ పాట పాడుతుంటే చరణ్, మరదలు అనుష్పలు కలిసి డ్యాన్స్ చేస్తారు. మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి కాలు కదుపుతుంది. ఈ వీడియోను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది ఉపాసన. తాజాగా తన సోదరి పెళ్లి ఘనంగా ముగిసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఉపాసన. ఈ సందర్భంగా తన చెల్లిని అశీర్వదించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా అనుష్పల- అర్మాన్ ఇబ్రహీం వివాహ వేడుక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read:
Top Searched Movies 2021: ఆ సినిమాల కోసం ఈ ఏడాది గూగుల్‌ను ఎక్కువగా గాలించేశారట..
Akhanda Collection: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్
Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ముద్దగుమ్మ మెహ్రీన్..