Puneeth Rajkumar Death: పునీత్ మరణం పై రామ్ చరణ్ – రోజా ఎమోషనల్ కామెంట్స్..
పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. చేసింది 29 సినిమాలే అయినా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్.
Puneeth Rajkumar Death: పునీత్ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగారు పునీత్ రాజ్ కుమార్. చేసింది 29 సినిమాలే అయినా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలో మించేసింది. అప్పు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పునీత్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృత్య్ చెందడం తో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్ కు తరలించారు కుటుంబసభ్యులు. పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ వార్త విని కన్నడ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులంతా పునీత్ మరణ వార్త విని షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా పునీత్ మరణం పై మెగా పవర్ స్టార్ ట్వీటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రామ్ చరణ్ రాసుకొచ్చారు. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం బ్రదర్ అని చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఆలాగే సినీనటి, నగిరి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ.. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని చాలా బాధేసింది. ఆయనకు నేను తల్లిగా ఓ సినిమాలో నటించాను. పునీత్ చాలా మంది వ్యక్తి. వాళ్ళ నాన్న ఎంత పెద్ద హీరో అయినా చాలా సింపుల్ గా ఉంటాడు పునీత్. వాళ్ళ అన్నతో కూడా నేను నటించాను. అందరు చాలా మంచి వాళ్ళు. వర్కౌట్స్ చేస్తూ పునీత్ చనిపోయారని తెలియగానే ఎం మాట్లాడాలో అర్ధం కావడంలేదు. పునీత్ అందరితో మంచిగా ఉంటాడు. కేవలం కన్నడ ఇండస్ట్రీనే కాదు సౌత్ మొత్తం బాధపడాల్సిన విషయం ఇది అన్నారు రోజా. పునీత్ చనిపోయాడని తెలిసిన దగ్గర నుంచి మాటలు రావడంలేదు కన్నీళ్లు ఆగడం లేదు అంటూ రోజా ఎమోషనల్ అయ్యారు.
Unable to digest…. My dear #PuneetRajkumar Garu was one of the warmest & most genuine person I have met . My deepest condolences to his family & fans.. ! We will miss you a lot dear brother!!??
— Ram Charan (@AlwaysRamCharan) October 29, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :