Raju Weds Rambai: ‘నన్ను క్షమించండి’.. సడెన్‌గా మాట మార్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఏమైందంటే?
ఈ శుక్రవారం (నవంబర్ 21 ) థియేటర్లలో రిలీజైన సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొత్త డైరెక్టర్ సాయిలు కాంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (నవంబర్ 21) థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా డైరెక్టర్, నటీనటులు అందరూ కొత్త వాళ్లే. అంతో ఇంతో సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ మాత్రమే కాస్త తెలిసిన యాక్టర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సాయిలు కాంపాటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో అఖిల్ రాజ్, తేజస్వి రావు హీరోహీరోయిన్లు గా నటించారు. కొత్త సినిమానే అయినా గట్టిగా ప్రమోషన్లు నిర్వహించిందీ చిత్ర బృందం. హీరో, హీరోయిన్లతో పాటు డైరెక్టర్ కూడా పలు ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో సందడి చేశారు. ఇదే క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయిలు కాంపాటి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాపై బాగా ఆశలు పెట్టుకున్న అతను ‘ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ లో చొక్కా తీసి తిరుగుతా’ అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. సినిమా బాగున్నా సరే కొత్త డైరెక్టర్ ఇలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా? అని చాలామంది అభిప్రాయపడ్డారు.
డైరెక్టర్ ఆశించినట్లే రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సాయిలు కాంపాటి కాస్త వెనక్కుతగ్గాడు. గతంలో తాను చేసిన ‘అమీర్ పేట’ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడిన డైరెక్టర్ సాయిలు.. ‘కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్‌పేట్‌లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా’ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సాయిలు. మొదటి సినిమా అయినా తన టేకింగ్ తో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
సినిమా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ కామెంట్స్.. వీడియో..
“Konni Years Nunchi Padina Kashtaniki Ee Phalitham Chushaka Maatalu Raatledu”
Watch Director #SaailuKampati speech @ #RajuWedsRambai Gratitude Meet💥
Event By @shreyasgroup ✌️#RajuWedsRambai #RajuWedsRambaiGratitudeMeet@etvwin @venuudugulafilm… pic.twitter.com/xtHCdo2KWG
— Shreyas Media (@shreyasgroup) November 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








