Rahul Sipligunj: సార్.. మీరు మా పెళ్ళికి తప్పకుండ రావాలి !!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డిల వివాహం నవంబర్ 27న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పెళ్లికి ఆహ్వానించారు రాహుల్. హరిణ్యా రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది.
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో తన జీవితంలో ఓ కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన హరిణ్యా రెడ్డితో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు రాహుల్- హరిణ్య ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇక ఇప్పుడీ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ నెల 27న రాహుల్- హరిణ్యారెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు రాహుల్ తన పెళ్లి శుభలేఖలు తీసుకుని సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు వెళుతున్నాడు. తన పెళ్లికి రావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 18న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన ప్రత్యేకంగా కలిశారు. తన పెళ్లి శభలేఖను అందజేసి వివాహ వేడుకకు రావాలని కోరాడు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వివాహ వేడుకకు వస్తాను అని టాలీవుడ్ సింగర్ తో చెప్పినట్లు న్యూస్. రాహుల్ సిప్లిగంజ్ మనువాడబోయే అమ్మాయి ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తెనే. రాహుల్ తో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంతో తమ ప్రేమ బంధాన్ని మరింత ధృఢంగా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ తెర మీదకు వస్తున్న క్లాసిక్ మూవీస్
సౌత్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శ్రద్ధా కపూర్
Sai Pallavi: మళ్లీ సౌత్ మీద దృష్టి పెట్టిన రౌడీ బేబి
Rasha Thadani: బాలీవుడ్ నయా సెన్సేషన్ రాషా తడాని
నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

