Rajinikanth: నటుడికి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్
చాలా మంది తమ మూవీ టీమ్ కు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ చైన్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓ నటుడికి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చి అతడిని ఆశ్చర్య పరిచారు. జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు . జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ గ నిలిచింది. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయినా జైలర్ కాసుల వర్షం కురిపిస్తుంది.

సినిమా హిట్ అయితే ఆ దర్శకుడికి హీరోలు కానీ నిర్మాత కానీ కాస్ట్లీ కారు లేదా మరేదైనా గిఫ్ట్స్ ఇవ్వడం మనం చూస్తుంటాం. అలాగే ఈ మధ్య కాలంలో సినిమా హీరోలు తమ చిత్రయూనిట్ కు గిఫ్ట్ లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. చాలా మంది తమ మూవీ టీమ్ కు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ చైన్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓ నటుడికి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చి అతడిని ఆశ్చర్య పరిచారు. జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారు . జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ గ నిలిచింది. తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయినా జైలర్ కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇక ఈ సినిమా సూపర్ స్టార్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. రజినీకాంత్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. అలాగే సునీల్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, వంటి వారు కీలక పాత్రలో నటించారు.
అలాగే ఈ సినిమాలో జాఫర్ సాదిక్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. జాఫర్ సాదిక్ మరుగుజ్జు అయినప్పటికీ అతని నటన డాన్స్ ప్రేక్షకులను మెప్పించింది. విక్రమ్ సినిమాతో జాఫర్ సాదిక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జైలర్ లోనూ కీలక పాత్రలో నటించాడు. ఇదిలా ఉంటే జాఫర్ సాదిక్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఆయన అందంతో తేలిపోతున్నారు. ఇంతకు సూపర్ స్టార్ జాఫర్ సాదిక్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.. గాగుల్స్. జైలర్ సినిమాలో రజినీకాంత్ వాడిన సూపర్ స్టైలిష్ గాగుల్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దాంతో తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. లైఫ్ లో మరిచిపోలేని గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు జాఫర్ సాదిక్.
నటుడు జాఫర్ సాదిక్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
