- Telugu News Photo Gallery Cinema photos Balakrishna New Movie Bhagavanth kesari Business in Tollywood Photos Telugu Entertainment Photos
Bhagavanth kesari: బాలయ్య మాస్ ఇమేజ్‌కి, అనిల్ మార్కు కామెడీ జోడైతే స్క్రీన్స్ బద్దలే.!
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. భగవంత్ కేసరి ఎంత బిజినెస్ చేసిందో తెలుసా? థియేట్రికల్ సైడ్ ఎంత జరిగింది? నాన్ థ్రియేట్రికల్ మాటేంటి? వీరసింహారెడ్డి ఎఫెక్ట్ ఎంత ఉంది? అని... అనీల్ రావిపూడి డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మీద మామూలుగా లేదు డిస్కషన్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. భగవంత్ కేసరి ఎంత బిజినెస్ చేసిందో తెలుసా? థియేట్రికల్ సైడ్ ఎంత జరిగింది? నాన్ థ్రియేట్రికల్ మాటేంటి.?
Updated on: Aug 23, 2023 | 8:43 PM

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. భగవంత్ కేసరి ఎంత బిజినెస్ చేసిందో తెలుసా? థియేట్రికల్ సైడ్ ఎంత జరిగింది? నాన్ థ్రియేట్రికల్ మాటేంటి? వీరసింహారెడ్డి ఎఫెక్ట్ ఎంత ఉంది? అని... అనీల్ రావిపూడి డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మీద మామూలుగా లేదు డిస్కషన్.

అడివి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి అంటూ బాలయ్య గర్జించిన తీరు చూసి, సౌండ్ బిజినెస్ జరుగుతోంది. రాజు ఆని ఎనకున్న వందల మంది మందని చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు అంటూ టీజర్‌తోనే దుమ్మురేపాడు భగవంత్ కేసరి.

నందమూరి బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్ అనీల్ రావిపూడి. ఆ ఫ్యాన్ బోయ్ మొమెంట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించిందని అంటున్నారు నందమూరి అభిమానులు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ లెక్కలన్నీ కలిపి దాదాపు 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది భగవంత్ కేసరి. బాలయ్య కెరీర్‌లో సూపర్‌డూపర్ ఫిగర్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్.

అనీల్ రావిపూడి తెరకెక్కించిన తీరు, ఆల్రెడీ వీరసింహారెడ్డి, అఖండ సినిమాలతో బాలయ్యకు పెరిగిన క్రేజు... ఇవన్నీ కలిపి ఈ లెక్కలను సెట్ చేశాయని అంటున్నారు క్రిటిక్స్.

బాలయ్య మాస్ ఇమేజ్‌కి, అనిల్ మార్కు కామెడీ టింజ్ తోడైతే థియేటర్లలో పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్. అఖండను మించిన హిట్ ఖాయం రాసుకోండి అంటోంది భగవంత్ కేసరి కాంపౌండ్.




