- Telugu News Photo Gallery Cinema photos Do you know Vijay Deverakonda, Allu Arjun and Samantha Tamannaah and kamal haasan first salary telugu cinema news
Tollywood: అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నుంచి సమంత వరకు.. ఈ స్టార్స్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా ?..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తాము అడగాల్సిన ప్రశ్నలను నేరుగా తమ అభిమాన స్టార్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక లైవ్ చిట్ చాట్స్ అంటూ నెటిజన్లతో ఇంట్రాక్ట్ అవుతున్నారు సెలబ్రెటీస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్స్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందామా.
Updated on: Aug 23, 2023 | 1:35 PM

సినీ పరిశ్రమలో స్టార్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాము అడగాల్సిన ప్రశ్నలను నేరుగా తమ అభిమాన స్టార్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక లైవ్ చిట్ చాట్స్ అంటూ నెటిజన్లతో ఇంట్రాక్ట్ అవుతున్నారు సెలబ్రెటీస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్స్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందామా.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యథిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె మొదటి సంపాదన మాత్రం రూ.500 అని చాలా తక్కువ మందికి తెలుసు. కాలేజీలో మొదటి స్టేజ్ ఫర్ఫామెన్స్ కు ఆమెకు ఫస్ట్ సాలరీ రూ.500 ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం సమంత న్యూయార్క్ లో సందడి చేస్తుంది.

విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఆయన ఒకరు. కానీ విజయ్ ఫస్ట్ సాలరీ కేవలం రూ.500. నటనలోకి రాకముందు విజయ్ కొద్ది మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవారని.. అప్పుట్లో అతనికి రూ.500 ఇచ్చేవారని తెలిపారు. అలాగే యాక్టింగ్ ట్రైనర్ గా వర్క్ చేసిన సమయంలో రూ.35,000 సాలరీ తీసుకున్నట్లు తెలిపారు.

అల్లు అర్జున్.. హీరోగా పరిచయం కాకముందు అల్లు అర్జున్ కు యానిమేటర్, డిజైనర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదట . మొదట్లో ఇంటర్న్ ఫ్యాషన్ డిజైనర్‍గా వర్క్ చేశారు. ఆ సమయంలో తనకు రూ.3500 ఇచ్చారట. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

కమల్ హాసన్.. తన మొదటి సినిమాలో నటించినందకు రూ.500 అందుకున్నారు. 1960లో కళత్తూర్ కన్నమ్మ చిత్రంలో నటించినందుకు గానూ కమల్ హాసన్ కు రూ.500 ఇచ్చారట. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రాజెక్ట్ కే చిత్రంలోనూ నటిస్తున్నారు.




