- Telugu News Photo Gallery Cinema photos Sankranthi 2024 Movies Update full details here Telugu Entertainment Photos
Sankranthi 2024 Movies: ఈసారి మరింత జాతరలా మారనున్న సంక్రాంతి.. పందానికి దిగిన చిన్న, పెద్ద సినిమాలు.
పంద్రాగస్టు వీకెండ్‌లో సంక్రాంతి పండగ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ నగర్‌లో. ముగ్గుల పండక్కి ముస్తాబవ్వాలంటే, ఇప్పటి నుంచే ఏ పని ఎంత జరిగింది? ఇంకెంత చేయాలనే లెక్కా పత్రాలు సరిచూసుకోవాలి కదా.. అందుకే ఫెస్టివల్‌కి వచ్చేస్తామని అనౌన్స్ చేసిన స్టార్ల సినిమాల మీద ఫోకస్ పెరుగుతోంది. కామిక్ కాన్‌కి వెళ్లొచ్చిన జోష్‌లో ఉంది కల్కి టీమ్. లోకనాయకుడు కమల్‌హాసన్ ఆల్రెడీ సెట్లో జాయిన్ అయ్యారు..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ravi Kiran
Updated on: Aug 23, 2023 | 8:43 PM

పంద్రాగస్టు వీకెండ్‌లో సంక్రాంతి పండగ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ నగర్‌లో. ముగ్గుల పండక్కి ముస్తాబవ్వాలంటే, ఇప్పటి నుంచే ఏ పని ఎంత జరిగింది? ఇంకెంత చేయాలనే లెక్కా పత్రాలు సరిచూసుకోవాలి కదా.. అందుకే ఫెస్టివల్‌కి వచ్చేస్తామని అనౌన్స్ చేసిన స్టార్ల సినిమాల మీద ఫోకస్ పెరుగుతోంది.

కామిక్ కాన్‌కి వెళ్లొచ్చిన జోష్‌లో ఉంది కల్కి టీమ్. లోకనాయకుడు కమల్‌హాసన్ ఆల్రెడీ సెట్లో జాయిన్ అయ్యారు.. రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందన్న వార్తలూ ఉన్నాయి. 2024 సంక్రాంతికి రావాల్సిన మూవీ ఇది.

సేమ్ సీజన్‌నే టార్గెట్ చేస్తున్నారు హనుమాన్ మేకర్స్. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి త్రీడీ పనులు జరుగుతున్నాయి.

సేమ్ సీజన్‌నే టార్గెట్ చేస్తున్నారు హనుమాన్ మేకర్స్. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి త్రీడీ పనులు జరుగుతున్నాయి.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. సెప్టెంబర్‌లో ఓ ఫారిన్ షెడ్యూల్ ఉంది. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తయిపోతుంది. సో సంక్రాంతికి రిలీజ్ కావడానికి ఇబ్బందేమీ ఉండదు. ఆల్రెడీ గీతగోవిందంలాంటి సక్సెస్ చూసిన కాంబినేషన్ కావడంతో ఈ మూవీ మీద ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఒక్క మాట చెప్పినా, పండగ తెచ్చే మాట చెప్పారు అంటూ మహేష్‌బాబుని పొగిడేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు మహేష్. సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాను మించి గుంటూరు కారం మూవీని ట్రెండ్ చేస్తామని అంటున్నారు ఫ్యాన్స్.





























