Movie News: టాప్ మూవీ న్యూస్.. విజయ్ క్రేజీ కామెంట్స్.. అలాటిదేమీ లేదంటున్న అమీషా
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కెరీర్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. అలాంటి లెజెండ్స్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు అతీతం అన్నారు. వాళ్ల కృషి వల్లే ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నారు. చెన్నైలో జరిగిన ఖుషి ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నెక్ట్స్ మూవీని కూతురు సుస్మిత కొణిదెల బ్యానర్‌లో చేస్తున్నారు చిరు. ఆ తరువాత బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Rajeev Rayala
Updated on: Aug 23, 2023 | 5:48 PM

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కెరీర్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ. అలాంటి లెజెండ్స్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌కు అతీతం అన్నారు. వాళ్ల కృషి వల్లే ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందన్నారు. చెన్నైలో జరిగిన ఖుషి ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ.

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నెక్ట్స్ మూవీని కూతురు సుస్మిత కొణిదెల బ్యానర్‌లో చేస్తున్నారు చిరు. ఆ తరువాత బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

టాలీవుడ్ మేకర్ రమేష్ వర్మ దర్శకత్వంలో తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఓ హారర్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తోంది. రమేష్ వర్మ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. భారీ స్టార్ కాస్ట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు మేకర్స్.

అకీరా ఫిలిం స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ రాఘవేంద్రరావు ఫోటో షేర్ చేయటంతో, పవన్ వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. ఈ వార్తలపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్, ప్రస్తుతానికి అఖీరాకు హీరో అవ్వాలన్న ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటే ముందు నేనే అందరికి చెబుతా అన్నారు రేణు.

గదర్ 2 సూపర్ హిట్ కావటంతో గదర్ 3 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపించింది. 2024 ఫస్ట్ క్వార్టర్‌లో త్రీక్వెల్‌ను పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలపై హీరోయిన్ అమిషా పటేల్ స్పందించారు. ఇప్పటి వరకు త్రీక్వెల్‌కు సంబంధించి తనను ఎవరు సంప్రదించలేదన్నారు అమిషా.





























