Rajinikanth: సినిమా చూస్తూ నాకు కన్నీళ్లు ఆగలేదు.. అమరన్ సినిమాపై రజినీకాంత్ రివ్యూ..

దీపావళి సందర్భంగా విడుదలైన అమరన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అమరన్ సినిమా టీంపై ప్రశంసలు కురిపించారు. రాజ్ పెరియసామి, శివకార్తికేయన్ లను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.

Rajinikanth: సినిమా చూస్తూ నాకు కన్నీళ్లు ఆగలేదు.. అమరన్ సినిమాపై రజినీకాంత్ రివ్యూ..
Rajinikanth
Follow us

|

Updated on: Nov 02, 2024 | 5:14 PM

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ అమరన్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి, నటుడు శివకార్తికేయన్ లను స్వయంగా పిలిచి మరీ అభినందించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రాజ్ కమల్ సంస్థ షేర్ చేసింది.

అందులో రజినీ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. రాజ్‌కమల్ సంస్థ నిర్మించిన అమరన్‌ సినిమాను చూశాను. ముందుగా కమల్ హాసన్ ని ఎంత పొగిడినా తప్పు లేదు. దివంగత సైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రను చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నందుకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్షన్ చాలా అందంగా ఉంది. సైన్యం గురించి చాలా సినిమాలు తీశారు. కానీ ఈ ఇలాంటి డైరెక్షన్ చూడలేదు. కెమెరా మేన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ మెప్పించారు. అతడి కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి అవుతుంది. ఇక సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక నాకు ఏడుపు ఆగలేదు.

సినిమా చూస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా అనిపించిన విషయం ఏమిటంటే, నా రెండవ సోదరుడు నాగేశ్వరరావు గైక్వాడ్ 14 సంవత్సరాలు సైన్యంలో పనిచేశాడు. చైనాతో యుద్ధంలో వెన్నులో కాల్పులు జరిపారు. దీంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. అందరూ తప్పక చూడాల్సిన సినిమా అమరన్. సైనికులంతా ఎన్ని కష్టాలు పడుతున్నారు.. సరిహద్దుల్లో మనల్ని ఎలా రక్షిస్తున్నారు అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.