Soundarya Rajinikanth: మరోసారి తల్లైన రజనీకాంత్‌ కూతురు.. తాత పేరు కలిసొచ్చేలా బిడ్డకు నామకరణం

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) మరోసారి తాతయ్యగా ప్రమోషన్‌ పొందారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ (Soundarya Rajinikanth) రెండోసారి తల్లయ్యారు. తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Soundarya Rajinikanth: మరోసారి తల్లైన రజనీకాంత్‌ కూతురు.. తాత పేరు కలిసొచ్చేలా బిడ్డకు నామకరణం
Soundarya Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Sep 12, 2022 | 4:29 PM

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, తలైవా రజనీకాంత్‌ (Rajinikanth) మరోసారి తాతయ్యగా ప్రమోషన్‌ పొందారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ (Soundarya Rajinikanth) రెండోసారి తల్లయ్యారు. తాజాగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను స్వయంగా ఆమే సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. తన బేబీ బంప్‌ ఫొటోలు, అలాగే మొదటి కుమారుడు వేద్‌ కృష్ణ, పుట్టిన పిల్లాడి చేతి వేళ్లను పట్టుకుంటూ దిగిన ఫొటోలను పంచుకుంటూ..’ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ (మొదటి కుమారుడు) తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. ఆదివారం వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి మా జీవితాల్లోకి వచ్చాడని మీతో షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని తన రెండో కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది సౌందర్య. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సౌందర్య దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

కాగా రజనీకాంత్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది సౌందర్య. గ్రాఫిక్‌ డిజైనర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. పడయప్ప (తెలుగులో నరసింహా), బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెంకోడి, శివాజీ తదితర సినిమాలకు ఆమె గ్రాఫిక్‌ డిజైనర్‌గా వ్యవహరించింది. తన తండ్రి రజనీకాంత్‌ హీరోగా కొచ్చాడయాన్‌ (తెలుగులో విక్రమసింహా)తో దర్శకురాలిగా మారింది. ఆతర్వాత ధనుష్‌ వీఐపీ2 సినిమాను కూడా తెరకెక్కించింది. కాగా 2010లో ఆమెకు అశ్విన్‌ రామ్‌కుమార్‌ అనే పారిశ్రామిక వేత్తతో వివాహమైంది. 2015లో వీరి జీవితంలోకి వేద్‌ కృష్ణ అడుగుపెట్టాడు. అయితే 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2019లో నటుడు, వ్యాపారవేత్త విషంగన్‌ వనంగమూడితో కలిసి రెండోసారి పెళ్లిపీటలెక్కింది. తాజాగా వీరిద్దరికి వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడి జన్మించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..