Coolie Box Office Collections Day 2: బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసిన కూలీ.. రజినీ వసూళ్ల సునామీ..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ మూవీ కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా కలెక్షన్లలో కూలీ రికార్డ్స్ సృష్టిస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి మరో హైలెట్ అనిరుధ్ మ్యూజిక్. ఎప్పటిలాగే తలైవా ఇమేజ్, క్రేజ్ కు తగినట్లుగా బీజీఎంతో దుమ్మురేపాడు. 74 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా ఫిట్నెస్ తో వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నారు రజినీ. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. నివేదికల ప్రకారం ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంటే విడుదలైన రెండు రోజు రూ.53.5 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా కూలీ చిత్రం నిలిచింది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు రూ.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఇండియా నుంచే రూ.55 కోట్ల వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు రోజుల్లోనే కూలీ సినిమా 200 మార్క్ క్రాస్ చేసింది. ఇదిలా ఉంటే.. శనివారం సాయంత్రం 4 గంటల సమయానికి కూలీ దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.15.9 కోట్లు సంపాదించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ఇందులో పూజా హెగ్డే మోనికా అంటూ స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సౌబిన్ సాహిర్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.ఈ సినిమాలో నాగ్ మొదటిసారి విలన్ పాత్రలో అదరగొట్టేశారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
