SS Rajamouli : ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి… కాన్సెప్ట్ ఏంటంటే..

సెకండ్ వేవ్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో స్టార్స్ అంతా ఖాళీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్‌లోనూ ఆర్ఆర్ఆర్  టీమ్ మాత్రం వర్క్‌ మోడ్‌లోనే ఉంది.

SS Rajamouli :  ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి... కాన్సెప్ట్ ఏంటంటే..
Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 06, 2021 | 6:13 AM

SS Rajamouli :

సెకండ్ వేవ్‌ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో స్టార్స్ అంతా ఖాళీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్‌లోనూ ఆర్ఆర్ఆర్  టీమ్ మాత్రం వర్క్‌ మోడ్‌లోనే ఉంది. నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించి ప్లానింగ్ చేస్తూనే… కోవిడ్ విషయంలో జనాల్లో అవేర్నెస్‌ కలిగించే ప్రయత్నం చేస్తోంది. అందరూ కరోనా ప్రోటోకాల్స్‌ పాటించాలంటూ ఆ మధ్య ఓ వీడియో మెసేజ్‌ రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్‌. తాజాగా మరో ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సహా.. యూనిట్‌ అంతా కోవిడ్ విషయంలో తమ అనుమానాల గురించి డాక్టర్లతో చర్చించి ఆ వీడియోలను షేర్ చేశారు. ఈ డిస్కషన్ తో ప్రజల్లో ఉన్న చాలా వరకు డౌట్స్‌ క్లియర్ అవుతాయంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అంతేకాదు ట్రిపులార్ టీమ్‌ అంతా కోవిడ్ వచ్చి కోలుకున్న వారే కావటంతో ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ను కూడా షేర్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోలేదు. ఈ సమయంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్ చేస్తున్న సేవలపై ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. సినిమా మేకింగ్ విషయంలోనే కాదు సోషల్ ఇష్యుస్ లోనూ యాక్టివ్‌గా ఉండే రాజమౌళి… డాక్యుమెంటరీ చేస్తే.. అది మరింతగా ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది మరి. ఇక ఆర్ఆర్ఆర్  విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. కరోనా నుంచి పరిస్థితులు కుదుటపడిన వెంటనే తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవవండి :

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.