AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fahad Fazil: ‘పుష్ప’ కోసం కష్టపడుతున్న మలయాళ స్టార్.. నేర్చుకుంటున్న ఫహాద్ ఫాజిల్..

"క్యారెక్టర్‌లో వేరియన్స్‌.. పర్ఫార్మెన్స్‌కి ప్లేస్‌" ఉంటే చాలు మలయాళీ వెర్సటైల్‌ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ని ఎవరూ ఆపలేరు.

Fahad Fazil: 'పుష్ప' కోసం కష్టపడుతున్న మలయాళ స్టార్..  నేర్చుకుంటున్న ఫహాద్ ఫాజిల్..
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2021 | 8:37 AM

Share

fahad fazil: “క్యారెక్టర్‌లో వేరియన్స్‌.. పర్ఫార్మెన్స్‌కి ప్లేస్‌” ఉంటే చాలు మలయాళీ వెర్సటైల్‌ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ని ఎవరూ ఆపలేరు. తన ఫర్ఫార్మెన్స్‌తో సినిమాని అమాంతం లాగేసుకుని ఓ మాస్టర్ పీస్‌ గా ఆ సినిమాను మారుస్తారు.  పాషన్ సినిమాల్లోకి వచ్చిన ఫాజిల్ మలయాళ ఇండస్ట్రీలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ గా పేరుతెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్‌లో కూడా అదే పేరు తెచ్చుకోడానికి.. ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాన్‌ ఇండియా మూవీ పుష్ఫతోనే ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు. ఇంతకీ ఏంటా మాస్టర్ ప్లాన్‌ అని మీరు కూడా అనుకుంటున్నారు కదూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోయే క్యారెక్టర్‌ చేస్తున్న ఫాజిల్.. ఆ క్యారెక్టర్‌ కోసం తెలుగు నేర్చుకోవాలని డెసీషన్ తీసుకున్నారట. సినిమాలోని తన క్యారెక్టర్‌ను పండించడానికి… తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి… తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. ఈ లాక్ డౌన్ టైంలో మరే పని చేయకుండా తెలుగుతో కుస్తీ పడుతున్నారట.. ఇప్పుడిదేవ విషయం ఇండస్ట్రీల వైరల్ గా మారింది.

ఇక “పుష్ప” సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Sonu Sood: ఏడాది చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూ సూద్

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!