Raja Vikramarka: గూఢచారిగా అదరగొడుతున్న కార్తికేయ.. ఘనంగా రాజా విక్రమార్క ప్రీరిలీజ్ ఈవెంట్..

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ

Raja Vikramarka: గూఢచారిగా అదరగొడుతున్న కార్తికేయ.. ఘనంగా రాజా విక్రమార్క ప్రీరిలీజ్ ఈవెంట్..
Karthikeya
Follow us

|

Updated on: Nov 06, 2021 | 8:05 PM

Raja Vikramarka: ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే విలన్‌గానూ చేస్తూ ఆకట్టున్నాడు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో స్పై గా కనిపించనున్నాడు కార్తికేయ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రాజా విక్రమార్క ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar : చిన్నవయసులో అప్పు మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే మనసుకు కష్టంగా ఉంది.. కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..