Puneeth Rajkumar : చిన్నవయసులో అప్పు మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే మనసుకు కష్టంగా ఉంది.. కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని అభిమానులు, సినిమాతారలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది 29 సినిమాలే అయినా ప్రేక్షకులనుంచి అంతులేని అభిమానం సంపాదించుకున్నారు

Puneeth Rajkumar : చిన్నవయసులో అప్పు మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే మనసుకు కష్టంగా ఉంది.. కన్నీటి పర్యంతం అయిన జయప్రద..
Puneet
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2021 | 5:07 PM

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని అభిమానులు, సినిమాతారలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది 29 సినిమాలే అయినా ప్రేక్షకులనుంచి అంతులేని అభిమానం సంపాదించుకున్నారు పునీత్. కన్నడ పవర్ స్టార్ గా ప్రేక్షకుల చేత మన్ననలు పొందారు పునీత్. మొన్నటివరకు నవ్వుతూ సందడిగా కనిపించిన వ్యక్తి ఇక లేడని, తిరిగి రాడని తెలిసిన దగ్గరనుంచి అందరి హృదయాలు ద్రవించిపోతున్నాయి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ హాస్పటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ మూగబోయింది. ఇంత చిన్న వయసులు పునీత్ అందరిని వదిలి వెళ్లిపోవడం ఏంటి..? ఇందంతా కల అయితే బాగుండు అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు.

ఇక పునీత్ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తున్నారు సినిమా తారలు. ఇప్పటికే పలువురు నటులు పునీత్ కుటుంబాన్ని ఓదార్చారు. తాజాగా సీనియర్ నటి జయప్రద పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ మనమధ్య లేడు అంటే నమ్మలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు జయప్రద. మనసుకు చాలా కష్టంగా  ఉంది అన్నారు. రాజ్ కుమార్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం.. ఈ కుటుంబంలో నేను ఓ మెంబర్ గా ఉన్నాను. ఎంతో గొప్ప నటుడిగా , గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న అప్పుచిన్నవయసులోనే మననుంచి వెళిపోయాడంటే చాలా కష్టంగా ఉంది అన్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎమోషనల్ అయ్యారు జయప్రద.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

Jai Bhim: నేనూ ఇలాంటి దారుణాలు చూశాను.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి.. ‘జై భీమ్‌’ సినిమాపై ఐఏఎస్ అధికారి స్పందన..

Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు