కాళ్లకు గాయాలు.. ఎన్నో జ్ఞాపకాలు.. రష్మిక మందన్నా ఎమోషనల్ పోస్ట్..

Rajitha Chanti

Pic credit - Instagram

14 May 2026

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం 'మైసా'. ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి  ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది.

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'మైసా' సినిమా సెట్స్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా ప్రయాణం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని, ముఖ్యంగా ఈ పాత్ర తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని ఆమె ఇన్ స్టాలో రాసుకొచ్చింది. 

షూటింగ్ ముగిసిన తర్వాత చిత్ర బృందంతో గడిపిన సమయాన్ని, అక్కడి జ్ఞాపకాలను మిస్ అవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.

అందులో ఆమె షూటింగ్ లోకేషన్‌లో చాలా సహజంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్మిక తన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోసింది. 

ఆమె డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని గుర్తు చేసుకుంది రష్మిక. 

ఆ సమయంలో తన మోకాళ్లకు గాయాలైనా పట్టు వదలకుండా పోరాడడం తనలోని ఆత్మ విశ్వాసాన్ని నింపిందని పేర్కొంది. ఉదయాన్నే నిద్ర లేవడం నుంచి అక్కడి

స్థానిక వంటకాలను ఆస్వాదించడం వరకు ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకమని వివరించారు. గాయాలైనప్పటికీ ఏమాత్రం విరామం తీసుకోకుండా షూటింగ్ చేసిందట.