AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 OTT: వెయిట్ ఈజ్ ఓవర్.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 2.. తెలుగులోనూ చూడొచ్చు.. కానీ..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా శుక్రవారం (మే 15) అర్ధరాత్రి నుంచే హిందీ, తెలుగుతో సహా అన్నీ ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Dhurandhar 2 OTT: వెయిట్ ఈజ్ ఓవర్.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 2.. తెలుగులోనూ చూడొచ్చు.. కానీ..
Dhurandhar The Revenge Movie
Basha Shek
|

Updated on: May 15, 2026 | 6:13 AM

Share

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). గత ఏడాడి డిసెంబర్ లో వచ్చిన ధురంధర్ కు ఇది సీక్వెల్. మార్చి 19న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. కలెక్షన్లలోసరికొత్త రికార్డ్స్‌ సృష్టించింది. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఎట్టకేలకు ధురంధర్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం (మే 15) అర్ధరాత్రి నుంచి ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమా చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

కాగా ‘Raw & Undekha’ అనే ట్యాగ్‌లైన్‌తో దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ధురంధర్ 2 రన్ అవుతోంది.. అంటే థియేటర్లలో కట్ చేసిన సీన్లతో కలిపి అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ అవుతుందన్న మాట. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. ఐబీ హెడ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ఒక ఖైదీని అండర్ కవర్ ఏజెంట్‌గా ఎలా మార్చారు? కరాచీ మాఫియా సామ్రాజ్యంలో అతడి ప్రయాణం ఎలా సాగిందనేది ఈ సినిమాలో చూడవచ్చు. స్పై యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ధురంధర్ 2 ఒక విజువల్ ఫీస్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి

ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ 2 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us