రామ్ పోతినేని ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే ఖంగు తింటారు

14 May 2026

Pic credit - Instagram

Phani Ch

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే అందరికీ ఇష్టమే. కానీ, రామ్‌కు అత్యంత ఇష్టమైన ఆ హీరో ఎవరో మీకు తెలుసా?

ఆయన మరెవరో కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్! చిన్నప్పటి నుండి రామ్ ఆయనకు పెద్ద ఫ్యాన్ అట.

రామ్ తన చిన్నతనం నుండే రజనీకాంత్ సినిమాలను చూస్తూ పెరిగారు. తలైవా స్టైల్, మేనరిజమ్స్ అంటే రామ్‌కు ప్రాణం.

రజనీకాంత్ వెండితెరపై కనిపించే విధానం తనను ఎంతో ప్రభావితం చేసిందని రామ్ పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే రామ్ ఎనర్జీలో కూడా ఆ స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది.

 రజనీకాంత్ గురించి రామ్ మాట్లాడుతూ  ఆయన కేవలం నటుడే కాదు, తనకు ఒక గొప్ప ప్రేరణ అని రామ్ మనసులో మాటను బయట పెట్టారు

సాధారణంగా నటులకు ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది. కానీ రామ్‌కు రజనీకాంత్ అంటే ఒక రకమైన పూజ్యభావం. రజనీకాంత్ నటనలోని సింప్లిసిటీ, ఆయన ఆఫ్-స్క్రీన్ ప్రవర్తన రామ్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

చెన్నైలో పెరగడం వల్ల రామ్‌కు రజనీకాంత్ క్రేజ్ అంటే ఏంటో ప్రత్యక్షంగా తెలుసు. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ ఉండే సందడి, అభిమానుల కోలాహలం రామ్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచాయట.