డిఫరెంట్ స్టోరీతో రానున్న రాజ్ తరుణ్.. టార్టాయిస్ పోస్టర్ అదిరిందిగా..
పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే “

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం అయింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఇది కూడా చదవండి : ఆమె నా సినిమాలో చేయకపోవడమే మంచిదైంది.. స్టార్ హీరోయిన్ పై రాజమౌళి
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “”టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ, దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం చాలా బాగుంది. ఇంత మంచి కథతో వస్తున్నా మా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి కంగ్రాట్స్. ఈ చిత్రం నా కెరీర్ కి మంచి కిక్ ఇస్తుంది” అని తెలిపారు.
ఇది కూడా చదవండి : రెండే రెండు సినిమాలు హిట్. మిగిలినవన్నీ ఫ్లాప్.. దెబ్బకు మాయం అయ్యింది
దర్శకుడు రిత్విక్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా పూజ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు స్వాగతం. “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. రాజ్ తరుణ్ గారికి కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ మరియు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈరోజు మా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసాం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లకి నా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! పెట్టింది రూ. 16 కోట్లు.. వచ్చింది రూ.400కోట్లు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
