Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeeva : నాకో స్పెషల్ పవర్ ఉంది.. అది ఆహాలో చూపిస్తానంటున్న రాజ్ తరుణ్..

ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు.. అదిరిపోయే వెబ్ సిరీస్‌లను అందిస్తుంది. తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఆహా ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్‌లతో పాటు ఆకట్టుకునే టాక్ షోలు, అలరించే గేమ్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.

Chiranjeeva : నాకో స్పెషల్ పవర్ ఉంది.. అది ఆహాలో చూపిస్తానంటున్న రాజ్ తరుణ్..
Chiranjeeva
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2024 | 6:39 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఇప్పటికే అదిరిపోయే వెబ్ సిరీస్లు , సూపర్ హిట్ సినిమాలను అందించింది. కొత్త సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు ఎన్నో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమాలు, సిరీస్ లతో పాటు గేమ్ షోలు, టాక్ షోలు, సింగింగ్ షోతో ప్రేక్షకులను అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది ఆహా. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరపేక్షకుల ముందుకు తీసుకురానుంది. రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ మూవీని అనౌన్స్ చేసింది ఆహా టీమ్. రొటీన్‌కు భిన్నంగా ఉండే కథలతో సిరీస్లు, సినిమాలు తెరకెక్కిస్తున్న ఆహా.. ఇప్పుడు పౌరాణిక నేపథ్యంలో ఓ సినిమాను తీసుకు రానుంది. ముందుగా ఈ సినిమా ను సిరీస్ గా తెరకెక్కించాలని అనుకున్నారు. ఇప్పుడు దాన్ని సినిమాగా మార్చి రిలీజ్ చేయాలనుకులుంటున్నారట.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి అరాచకం రా సామీ..! ఈ హాట్ బ్యూటీ.. 3 మూవీలో శ్రుతిహాసన్ చెల్లెలా..!!

“చిరంజీవ” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఓ కొత్త సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఆహా సంస్థ. “యముడితో ఆట”అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సినిమా జనవరి 2025లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ డైరెక్టర్ అభినయ కృష్ణ( జబర్దస్త్ ఫెమ్ అదిరే అభి) రూపొందించిన చిరంజీవ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. అద్భుతమైన కథనంతో ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

అలాగే ఈ సినిమాలో యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా రాజ్ తరుణ్ తో ఓ వీడియోను వదిలారు. నాకు ఓ స్పెషల్ పవర్ ఉంది మీకు ఎవ్వరికి తెలియని విషయాలు నాకు తెలుస్తాయి.. ఆ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే ఆహా చూస్తూ ఉండండి అని రాజ్ తరుణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎ. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రఖ్యాత స్వరకర్త అచ్చు రాజమణి ఆకర్షణీయమైన స్కోర్‌ను అందించనున్నారు. ఇక ఈసినిమాలో రాజ్ తరుణ్ తో పాటు నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. టైటిల్ తోనే సిరీస్ పై ఆసక్తి పెరిగిపోయింది.  మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఈ వయసులోనూ ఇలా ఉందేంటీ..!! సాహోలో నటించిన ఈ నటి గుర్తుందా..?

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.