అంతమాటనేసిందేంటీ..! పూరి, విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ పై రాధికా క్రేజ్ రియాక్షన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. హీరోయిజం.. పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు పూరి. అప్పట్లో పూరి జగన్నాథ్ మూవీస్ వచ్చాయంటే థియేటర్లు మాస్ జాతర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా స్టైల్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా యూత్ ను ఎలా ఆకట్టుకోవాలి పూరికి బాగా తెలుసు.. అందుకే ఆయన సినిమాలు యూత్ ను విపరీతంగా మెప్పిస్తుంటాయి. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్‌తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే కొంతకాలంగా పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.
ఇది కూడా చదవండి : పుష్పలో షెకావత్ పాత్ర నేనే చేయాలి.. కానీ చివరి నిమిషంలో.. అసలు విషయం చెప్పిన హీరో
ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ రాధికా ఆప్టే నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు పూరి. ఇదిలా ఉంటే తాజాగా పూరి సినిమాలో నటిస్తున్నారా.? అని రాధికా ఆప్టేకు ప్రశ్నకు ఎదురైంది. దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చింది అందాల భామ.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
పూరీజగనాథ్ సినిమాలో నటిస్తున్నానని నాకు కూడా తెలీదు అంటూ ఫన్నీగా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి ఊహాగానాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని రాధికా చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇలాంటి రూమర్స్ తనకు చాలా ఫన్నీగా అనిపిస్తాయని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నెగిటివ్ రోల్ లో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








