Radhe Shyam : రాధేశ్యామ్ లో సరికొత్త లుక్ లో ప్రభాస్.. కాస్ట్యూమ్ ఖర్చుతెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఏకంగా….

రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్తూ దూసుకుపోతున్నాడు. ప్రేమికుల రోజున ప్రభస్ నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి చిన్న గ్లిమ్స్ అఫ్ రాధేశ్యామ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు

Radhe Shyam : రాధేశ్యామ్ లో సరికొత్త లుక్ లో ప్రభాస్.. కాస్ట్యూమ్ ఖర్చుతెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఏకంగా....
Follow us

|

Updated on: Feb 16, 2021 | 4:19 PM

Radhe Shyam :  రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్తూ దూసుకుపోతున్నాడు. ప్రేమికుల రోజున ప్రభస్ నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి చిన్న గ్లిమ్స్ అఫ్ రాధేశ్యామ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోతో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూరప్ నేపథ్యంలో వింటేజ్ పిరియాడికల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాకు ‘జిల్’ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా  కనిపించనున్నాడు. అప్పటికాలానికి తగ్గట్టుగా కనిపించేందుకు ప్రభాస్ కాస్ట్యూమ్స్ ను లావిష్ గా డిజైన్ చేశారట ఇందుకోసం కోసం భారీగా ఖర్చుపెట్టారని తెలుస్తుంది. డార్లింగ్ స్టైలిష్ లుక్ కోసం ఏకంగా 6కోట్లు ఖర్చుచేశారట. ఇక ఈ సినిమా ముద్దుగుమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  ఇక ఈ సినిమాతోపాటు ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఆదిపురుష్ సెట్ లో అగ్నిప్రమాదం జరగడంతో షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి ఆ డేట్స్ ను  సలార్,నాగ్ అశ్విన్ సినిమా కోసం కేటాయిస్తున్నాడని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ఇలా డేట్స్ వెస్ట్ కాకుండా  షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడు డార్లింగ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రేజీ కాంబినేషన్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజా కోసం హీరోయిన్ ఫిక్స్..

Nandamuri Balakrishna : బాలయ్యతో తలపడే విలన్ అతడేనా.. బిబి3 కోసం బాలీవుడ్ స్టార్ హీరోని దించుతున్న బోయపాటి….

Latest Articles