Nayanthara: ఆ సినిమా నుంచి తప్పుకున్న నయనతార.. లేడీ సూపర్ స్టార్ స్థానంలో ఆ యంగ్ హీరోయిన్ ?..
ప్రస్తుతం ఆమె చేతిలో 9 చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నయన్ ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నయన్ ఓ సినిమా చేస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో నటుడు మాధవ్, సిద్ధార్త్ ప్రధాన పాత్రలలో నటించనున్నట్లు సమాచారం.

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఉన్న అగ్రహీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయన్. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. గతేడాది డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న నయన్.. అదే ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే పెళ్లి తర్వాత నయన్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె చేతిలో 9 చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నయన్ ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నయన్ ఓ సినిమా చేస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా వస్తోన్న ఈ చిత్రంలో నటుడు మాధవ్, సిద్ధార్త్ ప్రధాన పాత్రలలో నటించనున్నట్లు సమాచారం. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల నయనతార నటించడం లేదని.. ఆమెకు బదులుగా రాశీ ఖన్నాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి ది టెస్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా రాశీ ఖన్నా ఇటీవల నటుడు కార్తీ సరసన నటించిన సర్దార్ చిత్రం మంచి విజయాన్న అందుకుంది.




దీంతో ఈ ముద్దుగుమ్మకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇప్పుడు తమిళంలో గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రాశీ నటిస్తున్నారు. ఇందులో జీవా హీరోగా నటిస్తుండగా.. అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు.




