Ganesh Acharya: చిక్కుల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్.. లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్ షీట్
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఈ బెడద ఉన్నప్పటికీ సినిమా రంగంలో బయటకు వస్తూ ఉంటాయి. మొన్నామధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ ఈ బెడద ఉన్నప్పటికీ సినిమా రంగంలో బయటకు వస్తూ ఉంటాయి. మొన్నామధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. చాలా మంది సినిమా తారలు తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెట్టారు. మరి కొంతమంది షాకింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ లైగిక వేధింపుల ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. గణేష్ ఆచార్య(Ganesh Acharya) ఈ పేరు వినేవుంటారు. ఈయన బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘డీజే’ సినిమాలోని గుడిలో బడిలో పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాట తర్వాత రీసెంట్ గా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మామ’ అనే పాటకు కూడా గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక విషయానికొస్తే గణేష్ ఆచార్య దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నడ్యాన్సర్.. ఆయన తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడని ఆరోపించారు. అశ్లీల వీడియో చూపించడం, అసభ్యకరంగా మాట్లాడటం, లైంగికంగా వేధించడం చేశేవాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె 2020లో పోలీస్ కేసు ఫైల్ చేశారు. ఈ కేసు ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.. కేసు విచారణ అనంతరం తాజాగా కోర్టులో గణేష్ ఆచార్య పై చార్జ్ షీట్ దాఖలు చేయబడింది. గణేష్ ఆచార్య పై దాఖలు చేయబడిన ఛార్జ్ షీట్ వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. 354-ఎ – 354-సి – 354-డి – 509 – 323 – 504 – 506 సెక్షన్ల కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. గణేష్ మాస్టర్ తో పాటు అతడి సహాయకుడి పైన కూడా చార్జ్ షీట్ దాఖలు అయ్యింది. మరి ఈ విషయం పై గణేష్ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :