Pushpa 2 Movie: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ అంతే.. ఇక క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..

| Edited By: Rajitha Chanti

Dec 02, 2024 | 4:03 PM

స్క్రీన్‌ మీద సినిమా మూడు గంటలకు పైగా ఉన్నా... థియేటర్లో కూర్చుని చూసే ప్రేక్షకులకు రెండున్నర గంటలే చూసినట్టు అనిపిస్తుంది. అంత ఎంగేజింగ్‌గా ఉంటుంది... పుష్ప ది రూల్‌ గురించి ప్రొడ్యూసర్‌ చెప్పిన మాటలు ఇవి.. మరి సెన్సార్‌ కోసం స్క్రీన్‌ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీలయ్యారా? చూసేద్దాం పదండి..

Pushpa 2 Movie: పుష్ప 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ అంతే.. ఇక క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్..
Pushpa 2
Follow us on

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్‌ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది. 3. 20 నిమిషాల 38 సెకన్లు నిడివి ఉన్నట్టు సమాచారం. సెన్సార్‌ బోర్డు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సర్టిఫికెట్‌ సంగతి సరే, సినిమాలో కంటెంట్‌ ఎలా ఉందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలే బయటికొచ్చాయి. ఫస్టాఫ్‌ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. సెకండాఫ్‌లో యాక్షన్‌ పీక్స్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే మూడు యాక్షన్‌ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ యాక్షన్‌ సన్నివేశాలైతే ఎవరి ఊహకూ అందనంత భారీగా ఉంటాయి. నెవర్‌ బిఫోర్‌ అనేలా మెప్పిస్తాయన్నది ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్న మాట.

ఇకపై ఇంతింత గ్యాప్‌ తీసుకోను.. నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉంటాను అని కేరళ వేదికగా బన్నీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నిటినీ పుష్ప2 సరికొత్తగా రాస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బన్నీలో. సినిమా ఎక్కడా డిస్పాయింట్‌ చేయదని పదే పదే చెబుతున్నారు రష్మిక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ డ్రామా చిత్రం ‘పుష్ప2. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్‌ నిర్వహించిన పుష్ప ..ఇప్పుడు హైదరబాద్‌లో ప్లాన్‌ చేసింది.

తెలుగు అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 స్పెషల్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించడంతో బన్నీ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. పుష్ప వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.