Puri Jagannadh: అలా కనిపించాలంటే గట్స్ కావాలి.. ఆ క్రెడిట్ అంతా విజయ్‌దే అన్న పూరిజగన్నాథ్
మరికొద్దిరోజుల్లో లైగర్(Liger) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరికొద్దిరోజుల్లో లైగర్(Liger) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమా సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఏ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను పూరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాజాగా చిత్రయూనిట్ ఛార్మి, విజయ్ , పూరిజగన్నాథ్ కలిసి ఓ ఇంట్రవ్యూ చేశారు. ఈ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. నేను కతిహా మాత్రమే విజయ్ కు చెప్పా.. ఆ లుక్ మొత్తం తానే డిజైన్ చేసుకున్నాడు. బాడీ పెంచి, హెయిర్ పెంచి కొత్త లుక్ లోకి మారిపోయాడు. అలాగే ఈ సినిమాలో షార్ట్ వేసుకొని కనిపిస్తాడు విజయ్. నిజంగా అలాంటి సీన్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ క్రెడిట్ అంతా విజయ్ దే అని చెప్పుకొచ్చారు పూరిజగన్నాథ్. ఒక ఫ్రెండ్ కు నేను విజయ్ లోయర్ వేసుకున్న ఫోటో చూపించా.. అది చూసి వాడు అన్న ఏంటన్న లోయర్ లో చుపించావ్ హీరోని అని అన్నాడు. దానికి నేను మా వాడు సినిమా కోసం ఏమైనా చేస్తాడు, అవసరమైతే చెడ్డీ కూడా తీసేస్తాడు అని అన్నాను.. ఆ తర్వాత విజయ్ న్యూడ్ ఫోటో వచ్చేసింది అని నవ్వేశారు పూరిజగన్నాథ్.