AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSPK26 : పవన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..రెస్పాన్స్ అదిరిపోయింది..

PSPK26 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది.  రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్..తిరిగి తెరంగేట్రం చేస్తోన్న ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్‌లుక్ విడుదలైంది.  ఇది పవన్ కళ్యాణ్ 26వ మూవీ. త్రివిక్రమ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ తరవాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఒక దశలో ఆయన తిరిగి సినిమాల్లో నటించరనే వార్తలు కూడా వచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అంతగా […]

PSPK26 : పవన్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది..రెస్పాన్స్ అదిరిపోయింది..
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2020 | 5:27 PM

Share

PSPK26 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది.  రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్..తిరిగి తెరంగేట్రం చేస్తోన్న ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్‌లుక్ విడుదలైంది.  ఇది పవన్ కళ్యాణ్ 26వ మూవీ. త్రివిక్రమ్‌తో చేసిన ‘అజ్ఞాతవాసి’ తరవాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఒక దశలో ఆయన తిరిగి సినిమాల్లో నటించరనే వార్తలు కూడా వచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అంతగా ప్రభావం చూపలేకపోయింది. రిజల్ట్స్ తర్వాత కూడా చాలా నెలలు సినిమాలకు దూరంగా ఉన్న పవన్..ఎట్టకేలకు ‘పింక్’ రీమేక్‌తో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు.  వరుసగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్‌కు పండుగ తెచ్చారు.

తాజాగా రిలీజైన ‘పింక్’ లోని పవన్ లుక్ దుమ్మురేపుతోంది. పవన్‌ కల్యాణ్‌ లాయర్‌గా నటిస్తున్న పింక్‌ తెలుగు రీమేక్‌ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ అనే పేరును ఖరారు చేశారు. చుట్టూ పుస్తకాల మధ్య స్టైల్‌గా పడుకుని పుస్తకం చదువుతున్న పవన్‌ కల్యాణ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. వకీల్‌సాబ్‌ అనగానే నల్లకోటు వేసుకున్న లుక్‌‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే తాజాగా విడుదలైన లుక్‌లో పవన్‌ గుబురుగడ్డంతో, కూలింగ్‌ గ్లాస్‌తో స్టైల్‌గా కనిపిస్తున్నారు.  బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను సమర్పిస్తుండగా… బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు చిత్ర దర్శకుడు.

ఇది కూడా చదవండి : ఆత్మహత్యలొద్దంటూ స్కూల్లో రైతు కొడుకు పద్యం..అంతలోనే తండ్రి బలవన్మరణం

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..