Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్
డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే సలార్ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రభాస్ మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. సలార్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఫోటోలలో ప్రభాస్ మాసీ లుక్‌లో చెమటలు చిందిస్తూ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అదురుచూస్తున్నఫ్యాన్స్. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు నటుడు పృథ్వీరాజ్.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆయన సలార్ సినిమా గురించి స్పందిస్తూ.. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ఖాయం అంటూ హైప్ ను మరింత పెంచారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సలార్’ సెట్స్ లో పని చేస్తున్న భారతదేశంలోని మోస్ట్ క్రియేటివ్ మైండ్స్‌లో ఒకరిని చూడగలిగే అవకాశం నాకు లభించింది! ప్రశాంత్ నీల్ సార్.. మీరు మీ సొంత లీగ్ లో ఉన్నారు. మీరు తీస్తున్న సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టేట్లు కనిపిస్తోంది! మీ సెట్లను సందర్శించడం.. మీ ఎలిమెంట్‌లో మిమ్మల్ని చూడటం.. మీ విజన్ ని స్క్రీన్ పైకి అనువదించడం ఎంతో ఆనందంగా ఉంది! అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.