AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ms Raju : ఆ డైరెక్టర్ తో ఎలాంటి గొడవలు లేవు .. అవన్నీ అవాస్తవాలు… క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ రాజు..

టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా నిరూపించుకున్న ఎంఎస్ రాజు ఆతర్వాత దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే..

Ms Raju : ఆ డైరెక్టర్ తో ఎలాంటి గొడవలు లేవు .. అవన్నీ అవాస్తవాలు... క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ రాజు..
Rajeev Rayala
|

Updated on: May 24, 2021 | 10:01 PM

Share

Ms Raju : టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి నిర్మాత ఎంఎస్ రాజు. నిర్మాతగా నిరూపించుకున్న ఎంఎస్ రాజు ఆతర్వాత దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. నిర్మాతగా మహేష్ బాబుకు ఒక్కడు, ప్రభాస్ కు వర్షం, యంగ్ హీరో రామ్ కు మస్కా లాంటి హిట్ సినిమాలను అందించిన ఎంఎస్ రాజు దర్శకుడిగా ‘తూనీగ తూనీగ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఆతర్వాత ‘వాన’ అనే అందమైన ప్రేమకథను తెరకెక్కించారు. ఆతర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘డర్టీ హరి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు ఎంఎస్ రాజు. ‘వర్షం’ సూపర్ హిట్ తరువాత ప్రభాస్ హీరోగా ఎమ్మెస్ రాజు మరో సినిమాను నిర్మించారు .. ఆ సినిమా పేరే ‘పౌర్ణమి’.  ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇక సుమంత్ ఆర్ట్స్ బ్యానర్లో అంతకు ముందు వచ్చిన నువ్వొస్తానంటే నెనొద్దాంటానా.. చిత్రం బ్లాక్బస్టర్ దీంతో ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో మరో సినిమా తీయాలని ఎంఎస్ రాజు భావించారు. దాంతో పౌర్ణమి సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఆ సమయంలోనే ప్రభుదేవాకు .. ఎమ్మెస్ రాజుకు మధ్య గొడవ జరిగిందనే టాక్ వచ్చింది. సందర్భాన్ని బట్టి ఇప్పటికీ ఆ మాట వినిపిస్తూనే ఉంటుంది. అంతకుముందే ప్రభాస్ చత్రపతి రూపంలో భారీ హిట్ అందుకున్నాడు. మరోవైపు పౌర్ణమి కొంత హీరోయిన్ ఓరియెంటెంట్ మూవీగా ఉంటుంది. ఇలా రకరకాల కారణాలతో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే ఈ సందర్భంగా ఎంఎస్ రాజు.. దర్శకుడు ప్రభుదేవా మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. ” నిజమే అప్పట్లో ఆ టాక్ వచ్చింది .. కానీ అందులో నిజం లేదు. ప్రభుదేవాతో ఎలాంటి గొడవలు లేవు .. ఇప్పటికీ మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉంటాము” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

SonuSood: క‌లియుగ క‌ర్ణుడికి పాలాభిషేకాలు.. ప్రాణ‌వాయువు అందిస్తోన్న రియ‌ల్ హీరోకు జ‌న నీరాజ‌నాలు.. కానీ సోనూ మాత్రం..

Malaika Arora : చట్టపట్టాలేసుకు తిరగడం వరకు సరే.. ఇప్పటికైనా ఈ ప్రేమ జంట పెళ్లిపై స్పందిస్తారా..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి