Idupu Kayitham Movie : ఇడుపు కాయితం టైటిల్ మార్చే ప్రసక్తే లేదు.. వివాదంపై బన్నీ వాస్ రియాక్షన్..
ఇడుపు కాయితం .. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. నిజానికి సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ గురించి ఎప్పుడూ నెట్టింట ఏదోక చర్చ నడుస్తుంటుంది. కానీ ఈ మూవీ విషయంలో మాత్రం టైటిల్ రివీల్ చేయడంతోనే వివాదం మొదలైంది.

ఇటీవల కాలంలో తెలంగాణ యాస, సంస్కృతి మీద అనేక సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణ గ్రామీణ కథతో వచ్చిన బలగం , మల్లేశం చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో మూవీ రూపొందిస్తున్నారు. అదే ఇడుపు కాయితం. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ కథానాయికగా నటిస్తుంది. ఈసినిమాతోనే ఆమె హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇటీవల పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా పేరు ఇడుపు కాయితం అంటూ బైక్ పై సకినాలు, కళ్లు బాటిల్, టిఫిన్ బాక్సులతో కొత్త జంట వెళ్తున్న ఫోటోను రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్, భాష, యాస విషయంలో రెండు వర్గాలు విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా వివాదం పై నిర్మా బన్ని వాస్ స్పందించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
ఇది ఒక ప్రాంతానికి పరిమితమయ్యే కథ కాదని.. కథను బట్టే టైటిల్ ఉంటుంని వెల్లడించారు. ప్రస్తుతం వివాదం నేపథ్యంలో కథను, టైటిల్ మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బన్నీ వాస్ మాట్లాడుతూ. “ప్రతి సినిమాకు దాని కథ, నేపథ్యం బట్టే టైటిల్ ఉంటుంది. ఇకపై దాని గురించి చర్చ అనవసరం. షూటింగ్ కంప్లీట్ అయి సినిమా విడుదలయ్యాక ఆ మూవీనే మాట్లాడుతుంది. ఆంధ్రా తెలంగాణ ఎవరైనా సరే సినిమా నచ్చితేనే చూస్తారు. నచ్చకపోతే చూడరు. నేను చేయాల్సింది సినిమాను బాగా తీయడంపై దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఈ వివాదం వల్ల సినిమాకు కాస్త ఇబ్బంది కలిగింది. కానీ సినిమా బాగుంటే అన్ని సర్దుకుంటాయి. నాకు కథ మీద పూర్తి నమ్మకం ఉంది. దర్శకుడు వచ్చిన ప్రాంతం నుంచి రాసుకున్న కథ ఇది” అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
“ప్రాంతాన్ని బట్టి కథ ఉంటుందా అంటే ఎక్కడో తెరకెక్కించిన హాలీవుడ్ సినిమా ఇక్కడ ఆడదు కదా.. ప్రతి ఇంట్ల ఉండే కథే ఇది. క్లైమాక్స్ అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఆలోచించాలి. విభేధాలు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో నటీనటులకు డైలీ రెమ్యునరేషన్స్ ఇచ్చి సినిమా చేయలేను. అందుకే కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నాం. నా బడ్జెట్ కు నా పరిధిలోకి వచ్చేవారితోనే సినిమాలు చేస్తాను” అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఇడుపు కాయితం అంటే… విడాకుల పత్రం అని అర్థం. ఒకప్పుడు దంపతులు విడిపోవాలంటే పెద్దల సమక్షంలో ఇడుపు కాయితం రాసుకుని విడిపోయేవారు. ఇప్పటికీ తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాయితం రాసుకుని విడిపోతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..
