Meera Chopra: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన ‘బంగారం’ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేసింది. కొన్నాళ్లుగా హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరా చోప్రా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‏ను వివాహం చేసుకోనుందని టాక్. వీరిద్దరి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారట. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కానీ వరుడి ఫోటో మాత్రం బయటకు రాలేదు.

Meera Chopra: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన 'బంగారం' హీరోయిన్.. వరుడు ఎవరంటే?
Meera Chopra
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2024 | 7:45 PM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లికి రెడీ అయ్యింది. 40 ఏళ్ల వయసులో తన స్నేహితుడితో కలిసి ఏడడుగులు వేసేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. తెలుగు ప్రేక్షకులకు మీరా చోప్రా సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో కనిపించి గుర్తింపు తెచ్చుకుంది మీరా. అలాగే వాన సినిమాలోనూ నటించింది. కానీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేసింది. కొన్నాళ్లుగా హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరా చోప్రా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‏ను వివాహం చేసుకోనుందని టాక్. వీరిద్దరి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారట. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కానీ వరుడి ఫోటో మాత్రం బయటకు రాలేదు.

ఇన్విటేషన్ కార్డ్ ప్రకారం.. మార్చి 11, 12న తేదీల్లో హిందూ సంప్రదాయం ప్రకారం రెండు రోజుల పెళ్లి వేడుకలు జరగనున్నాయట. జైపూర్‌లోని బ్యూనా విస్టా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. మార్చి 11న సాయంత్రం 5 గంటలకు మెహందీ ఫంక్షన్ ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు సంగీత్, కాక్టెయిల్ పార్టీ జరగనుందట. ఇక మార్చి 12న ఉదయం 10 గంటలకు హల్దీ వేడుకలు జరుగుతాయి. మార్చి 12న సాయంత్రం 4.30 గంటలకు జయమాల వేడుక.. రాత్రి 9 గంటల నుంచి విందు, రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరుకానున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Earth08.r8 (@earth08.r8)

మీరా చోప్రా 2005లో ఎస్జే సూర్యతో కలిసి అన్బే ఆరుయిరే అనే తమిళ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత ఎంఎస్ రాజు తెరకెక్కించిన వాన సినిమాతో మీరాకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. చివరిసారిగా సఫేద్ చిత్రంలో కనిపించింది. ఇక మీరా చోప్రా సోదరి ప్రియాంక చోప్రా వీరి వివాహనికి హజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Meera Chopra (@meerachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే