AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కశ్మీరి అందాన్ని గుర్తుపట్టగలరా ?.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన అలనాటి అందాల తార..

దక్షిణాదిలోని స్టార్ అందరి సరసన నటించి మెప్పించింది. అప్పట్లో యూత్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన కథానాయికగా. 80'sలో బిజీ హీరోయిన్.. ఇప్పటికీ సహాయ నటిగానూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అప్పట్లో టాప్ హీరోయిన్‏గా వరుస సినిమాలతో దూసుకుపోయిన్ ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలలో అద్భుతమైన నటనతో అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉండేవారు.

Tollywood: ఈ కశ్మీరి అందాన్ని గుర్తుపట్టగలరా ?.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన అలనాటి అందాల తార..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2024 | 7:10 PM

Share

కాశ్మీరి సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ అమ్మాయి ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ కశ్మీరి అందం.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. దక్షిణాదిలోని స్టార్ అందరి సరసన నటించి మెప్పించింది. అప్పట్లో యూత్ ఫేవరేట్ హీరోయిన్ ఆమె. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన కథానాయికగా. 80’sలో బిజీ హీరోయిన్.. ఇప్పటికీ సహాయ నటిగానూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అప్పట్లో టాప్ హీరోయిన్‏గా వరుస సినిమాలతో దూసుకుపోయిన్ ఆమె.. ఇప్పుడు తల్లి పాత్రలలో అద్భుతమైన నటనతో అలరిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో వీరిద్దరి జోడిగా ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉండేవారు. ఇద్దరి కాంబోలో వచ్చిన అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. ఇప్పటికీ వీరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆమె ఎవరంటే సీనియర్ హీరోయిన్ రాధిక.

రాధిక.. తమిళ సినీ నటుడు… కమెడియన్ MR రాధ కుమార్తె. ఆమె నటించిన శ్రీలంక గీతా సినిమాలోనిది ఈ ఫోటో. రాధిక తన విద్యాభ్యాసం భారత్, శ్రీలంక, యుకెలో పూర్తి చేసింది.1978 తమిళ చిత్రం ఇష్కిష్కే పోమియా రైల్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు ఆమె 200కు పైగా సినిమాల్లో కనిపించింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్రనటులందరితో కలిసి నటించింది. రాధిక, చిరంజీవి కాంబోలో అభిలాష, దొంగ మొగుడు, జ్వాల, పట్నం వచ్చిన పతివ్రతలు, న్యాయం కావాలి, గూడఛారి నం.1, పులి బెబ్బులి, యమకింకరుడు, పల్లెటూరి మొనగాడు, కిరాయి రౌడీలు, హీరో, మొండిఘటం, ఆరాధన ఇంకా మరెన్నో సినిమాలు వచ్చాయి.

2001లో ఫిబ్రవరి 4న తమిళ నటుడు శరత్ కుమార్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో నమ్మ అన్నాచి, సూర్య వంశం సినిమాలు వచ్చాయి. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగాను గుర్తింపు తెచ్చుకున్నారు రాధ. రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ చైర్మ పర్సన్ రాధిక. అలాగే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె భర్త ఆర్. శరత్‌కుమార్‌తో కలిసి ఏఐఏడీఎంకేలో చేరారు. అయితే అదే ఏడాది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఆమె 2007 నుండి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కట్చి కార్యకర్తగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.