Priyanka Mohan: స్పీడ్ అందుకుంటున్న ప్రియాంక అరుళ్ మోహన్.. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్
ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ టాప్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది. తాజాగా ఓ కోలీవుడ్ టాప్ హీరో కూడా ప్రియాంకకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు అంతగా ఆడకపోవటంతో మకాం చెన్నైకి షిఫ్ట్ చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో దక్కని సక్సెస్.. తమిళ నాట వరించింది. కోలీవుడ్ ఫస్ట్ మూవీ డాక్టర్.. వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ప్రియాంక దశ తిరిగింది.

హ్యాపెనింగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ క్రేజీ ఆఫర్ కొట్టేశారు. ఇప్పటి వరకు తెలుగు రెండు ప్రాజెక్ట్స్, అది కూడా మీడియం రేంజ్ హీరోలతోనే చేసిన ఈ బ్యూటీకి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ టాప్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ దక్కింది. తాజాగా ఓ కోలీవుడ్ టాప్ హీరో కూడా ప్రియాంకకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు అంతగా ఆడకపోవటంతో మకాం చెన్నైకి షిఫ్ట్ చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో దక్కని సక్సెస్.. తమిళ నాట వరించింది. కోలీవుడ్ ఫస్ట్ మూవీ డాక్టర్.. వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ప్రియాంక దశ తిరిగింది.
సూర్యకు జోడిగా ప్రియాంక నటించిన ఈటీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ కూడా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటంతో ప్రియాంకను లక్కీ గర్ల్ అంటున్నారు మేకర్స్. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కింది. పవన్ హీరోగా సాహో ఫేం సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ఓజీ.
View this post on Instagram
గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుల్ మోహన్‌ను సెలెక్ట్ చేశారు దర్శకుడు. తాజా ఓ కోలీవుడ్ టాప్ హీరో కూడా ప్రియాంకకు ఛాన్స్ ఇస్తున్నారు. తమిళ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
View this post on Instagram
వెంటక్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో సీనియర్ నటి జ్యోతిక కూడా విజయ్‌కు జోడిగా నటిస్తున్నారు. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే వంద కోట్ల సినిమాల్లో నటించిన ప్రియాంకకు ఇప్పుడు ఏకంగా పవన్, విజయ్ లాంటి టాప్ స్టార్స్ సినిమాలో ఛాన్స్ రావటంతో ఈ సారి సక్సెస్ రేంజ్ మరో లెవల్‌లో ఉంటుందని పొంగిపోతున్నారు ఈ బ్యూటీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




