Tiger Shroff- Disha Patani : నేను సింగిలే టైగర్ ష్రాఫ్.. మరి దిశా పటని ఏమైందంటున్న ఫ్యాన్స్
టైగర్ ష్రాఫ్, దిశా పటని .. ఒకప్పుడు బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట. రిలేషన్‌లో ఉన్నట్టుగా ఒక్కసారి కూడా ఓపెన్ అవ్వకపోయినా.. వీళ్ల పబ్లిక్ అపియరెన్స్... హాలీడే ట్రిప్స్ ఎప్పుడూ న్యూస్‌లో హైలెట్ అవుతూ ఉండేవి. టైగర్ ఫ్యామిలీతోనూ మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు దిశా. అయితే ఇంత క్లోజ్‌గా ఉండే ఈ జోడి విడిపోయిందన్న న్యూస్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. కోవిడ్ టైమ్ అంతా ఒకే ఇంట్లో కలిసున్న టైగర్, దిశా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ చాలా సార్లు ట్రెండ్ అయ్యింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్‌లు ప్యాచప్‌లు క్వైట్ కామన్. కానీ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఓ జంట బ్రేకప్ ఇష్యూ మాత్రం ఆడియన్స్ ఐ బాల్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. అసలు ఈ జంట కలిసుందా విడిపోయిందా అన్న విషయం అర్ధంకాక తల పట్టుకుంటున్నారు ఫ్యాన్స్. టైగర్ ష్రాఫ్, దిశా పటని .. ఒకప్పుడు బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట. రిలేషన్‌లో ఉన్నట్టుగా ఒక్కసారి కూడా ఓపెన్ అవ్వకపోయినా.. వీళ్ల పబ్లిక్ అపియరెన్స్… హాలీడే ట్రిప్స్ ఎప్పుడూ న్యూస్‌లో హైలెట్ అవుతూ ఉండేవి. టైగర్ ఫ్యామిలీతోనూ మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు దిశా. అయితే ఇంత క్లోజ్‌గా ఉండే ఈ జోడి విడిపోయిందన్న న్యూస్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది.
కోవిడ్ టైమ్ అంతా ఒకే ఇంట్లో కలిసున్న టైగర్, దిశా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ చాలా సార్లు ట్రెండ్ అయ్యింది. ఎన్ని రూమర్స్ వైరల్ అయినా.. లవ్ లైఫ్ గురించి ఒక్క సారి కూడా స్పందించలేదు ఈ హాట్ కపుల్. కానీ బ్రేకప్ వార్తల మీద మాత్రం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్న టైమ్‌లో నేను సింగిలే అంటూ టైగర్ మళ్లీ మళ్లీ చెప్పారు.
View this post on Instagram
దిశా కూడా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాలకు ఫోజులిచ్చారు. దీంతో ఇక వీళ్ల రిలేషన్ ముగిసినట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు. మళ్లీ సోషల్ మీడియాలో ఒకరి పోస్ట్‌లకు మరొకరు రిప్లై ఇస్తూ… బాండింగ్ ఇంకా కొనసాగుతుందన్న సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ సోషల్ మీడియా యాక్టివిటీ టైగర్, దిశ మధ్య ప్యాచప్ జరిగిందన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
View this post on Instagram
కానీ అంతలోనే మరో ట్విస్ట్ వైరల్ అవుతోంది. దిశ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమె ముఖాన్ని టాటూగా వేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలతో పాటు ‘నువ్వు ఫ్రెండ్‌గా దొరకటం నా అదృష్టం’ అంటూ దిశ చేసిన కామెంట్ కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజెన్స్, టైగర్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




