Pawan Kalyan: లక్ అంటే ఈ భామలదే.. పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న కుర్ర భామలు
నటుడు, రైటర్ ఆయిన సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.

పవర్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో ‘వినోదాయ సిథం’ సినిమా ఒకటి. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా అందుకుంది. నటుడు, రైటర్ ఆయిన సముద్రఖని దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా యోజాకార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ మూవీలో పవన్ దేవుడి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంపిక చేశారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్నారు.
రొమాంటిక్ అనే సినిమాతో కేతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రంగరంగ వైభవంగా సినిమాలో నటించిన కేతిక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తోంది. మరో వైపు మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ నితిన్ నటించిన చెక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆసినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు భామతో పవన్ కళ్యాణ్ సినిమాతో హిట్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.. వీరితో పాటు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రాజా, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.