Actress Laya: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా? నటి లయ సమాధానం ఏంటో తెలుసా?
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న లయ హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

‘కీరవాణి రాగంలో పిలిచొందక హృదయం’ అంటూ స్వయంవరం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి లయ. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మనోహరం, మనసున్న మారాజు, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, శివరామరాజు, స్వరాభిషేకం తదితర హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో ఆమె పోషించిన అంధురాలి పాత్రకు ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం దక్కింది. ఇలా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న లయ హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, ఫ్యామిలీ పిక్స్‌ను షేర్ చేస్తుంటుంది .అలాగే తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్సులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన లయ తన సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి లయ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం అవుతారా? అన్నప్రశ్నకు లయ సమాధానమిస్తూ ‘ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు. కానీ.. పవన్ కల్యాణ్ కి సీఎం అయ్యే చరిష్మా ఉంది. ఆయన అవుతారా లేదా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. అయితే పవన్ ముఖ్యమంత్రి అయితే మాత్రం సీఎం కుర్చీకి ఆ ఆరా వస్తుంది. సీఎం అయినా, అవకపోయినా పవన్ టాప్ పోజిషన్‌లోనే ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ గురించి లయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాభిమానులను తెగ ఖుషీ చేస్తున్నాయి. కాగా లయ చివరిసారిగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె కూతురు కూడా ఓ చిన్న పాత్రలో కనిపించడం విశేషం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








