Kantara: కాంతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. ప్రధాని మోడీ కోసం స్పెషల్ స్క్రీనింగ్
అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ సినిమా ‘కాంతార’ . చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఇప్పుడు సంచనలన విజయం అనుకుంది. అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు.
భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది కాంతార మూవీ. ఇక విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీక్షించనున్నారట. నవంబర్ 14న ప్రధాని మోదీ ‘కాంతారా’ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో తిలకించనున్నారట.
ఇక సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతార రూ.200 కోట్లవైపు దూసుకెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లోనూ ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటించింది.




