Nivin Pauly: లైంగిక ఆరోపణలపై స్పందించిన ‘ప్రేమమ్’ హీరో.. ఏమన్నారంటే..

ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా మలయాళీ యంగ్ హీరో నివిన్ పౌలీపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. సినిమాలో అవకాశం ఉందని.. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటూ తనను దుబాయ్ తీసుకెల్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది.

Nivin Pauly: లైంగిక ఆరోపణలపై స్పందించిన 'ప్రేమమ్' హీరో.. ఏమన్నారంటే..
Nivin Pauly Reacts
Follow us

|

Updated on: Sep 03, 2024 | 9:34 PM

జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత ఇండస్ట్రీలోని పలువురు నటులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ చిత్ర పరిశ్రమలో ఈ నివేదిక పెను దుమారాన్ని సృష్టించింది. కేరళలోనే కాకుండా ఇతర భాషల సినీ పరిశ్రమల్లోనూ నటీమణులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారని.. ఎక్కడికి వెళ్లినా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ఆరోపించారు. ఇప్పటికే కొందరు నటీమణులు సదరు యాక్టర్స్ పై ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా మలయాళీ యంగ్ హీరో నివిన్ పౌలీపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. సినిమాలో అవకాశం ఉందని.. ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటూ తనను దుబాయ్ తీసుకెల్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ యువ నటి ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించింది.

మొత్తం ఆరుగురు వ్యక్తులపై దాఖలైన ఈ కేసులో హీరో నివిన్ పౌలీ పేరును ఆరో నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా ఈ కేసులో మొదటి నిందితురాలిగా శ్రేయ అనే అమ్మాయి పేరును చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసు గురించి హీరో నివిన్ పౌలీ స్పందించారు. అలాగే ఇండస్ట్రీలో తనపై వస్తున్న ఆరోపణలపై సుధీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తనపై వస్తున్న లైంగిక వేధింపుల కేసు పూర్తిగా అవాస్తవమని తన ఇన్ స్టాలో నోట్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

”ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు నాపై కేసు పెట్టినట్లు తెలిసింది. ఇది పూర్తిగా అవాస్తవం. నాపై తప్పుడు కేసు పెట్టారని దయచేసి అందరూ తెలుసుకోండి. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని నిరూపించేందుకు నేను కచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. అలాగే ఇందుకు కారకులు అయిన వారిని వెలుగులోకి తీసుకువస్తాను. అలాగే వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాను. నాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిగిలినవి చట్ట ప్రకారం పరిష్కరించబడతాయి” అంటూ ఇన్ స్టా నోట్ లో పేర్కొన్నారు. నివిన్ పౌలీ ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ ఏడాది మలయాళీ ఫ్రమ్ ఇండియా సినిమాలో నటించాడు. ఇటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.