AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరో హరీష్ ప్రాణాలను కాపాడిన హీరోయిన్.. 33 ఏళ్ల క్రితమే అలాంటి ఘటన జరిగిందా..

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా ప్రేమ ఖైదీ. ఇందులో హరీష్, మాల శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే అక్కడ కూడా ఈ సినిమాలో హీరోగా హరీష్ నటించగా..

Tollywood: హీరో హరీష్ ప్రాణాలను కాపాడిన హీరోయిన్.. 33 ఏళ్ల క్రితమే అలాంటి ఘటన జరిగిందా..
Harish
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2024 | 9:12 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా ప్రేమ ఖైదీ. ఇందులో హరీష్, మాల శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేశారు. అయితే అక్కడ కూడా ఈ సినిమాలో హీరోగా హరీష్ నటించగా.. కథానాయికగా కరిష్మా కపూర్ నటించింది. ఈ మూవీతోనే 33 ఏళ్ల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కరిష్మా. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా హరీష్ ప్రమాదంలో పడిపోయాడట. చివరకు అతడు ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడ్డాడో తాజాగా కరిష్మా కపూర్ బయటపెట్టింది. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కరిష్మా.. ‘ఆప్కా అప్నా జకీర్’ షోలో పాల్గొంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమా ప్రేమ ఖైదీ షూటింగ్ సమయంలో తన సహనటుడు హరీష్ ప్రాణాలను ఎలా కాపాడిందో చెప్పుకొచ్చింది.

“ప్రేమ ఖైదీ సినిమా షూటింగ్ సమయంలో నీటిలో మునిగిపోతున్న నన్ను హరీష్ రక్షించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నిజానికి నేనే అతడిని కాపాడాను. ఈ సీన్‌ని స్విమ్మింగ్‌ పూల్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ తనకు ఈత రాదని హరీష్‌ ఎవరికీ చెప్పలేదు. అయితే అక్కడ 4 అడుగుల లోతు వరకే వెళ్లాలి. కానీ మేమిద్దరం ఆ సీన్ లో లీనమైపోయి 5 అడుగుల లోతు వరకు వెళ్లాం. నేను రక్షించు, రక్షించు అని అరుస్తున్నాను. అప్పుడే నా వెనక నుంచి నన్ను రక్షించు అనే వాయిస్ వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి హరీష్ మునిగిపోతూ కనిపించాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి.. చేతులు పట్టుకొని లాక్కొచ్చాను. నా ఫస్ట్ మూవీలో హీరో నా ప్రాణాన్ని కాపాడాలి.. కానీ నిజానికి నేనే హీరో ప్రాణాలను కాపాడాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

1990లో తెలుగులో ప్రేమ ఖైదీ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి తెలుగులో ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. ఇదే చిత్రాన్ని నిర్మాత డి . రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా తర్వాత హరీష్ తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్త, గోకులంలో సీత, మనవరాలి పెళ్లి వంటి చిత్రాల్లో నటించాడు. 2017 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న హరీష్ ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
ఇద్దరు స్టార్ హీరోలతో బాక్పాఫీస్ షేక్ చేసే ప్లాన్ చేస్తున్న వెంకీ
ఇద్దరు స్టార్ హీరోలతో బాక్పాఫీస్ షేక్ చేసే ప్లాన్ చేస్తున్న వెంకీ
AIని ఈ 3 విషయాలు అడగకండి! మీరే చిక్కుల్లో పడతారు!
AIని ఈ 3 విషయాలు అడగకండి! మీరే చిక్కుల్లో పడతారు!
మణిపూర్ అమ్మాయి.. కొరియా అబ్బాయి.. విషాదంగా మారిన ప్రేమ..
మణిపూర్ అమ్మాయి.. కొరియా అబ్బాయి.. విషాదంగా మారిన ప్రేమ..
యంగ్ హీరోయిన్ బాధ విన్నారంటే కన్నీళ్లు అస్సలు ఆగవ్
యంగ్ హీరోయిన్ బాధ విన్నారంటే కన్నీళ్లు అస్సలు ఆగవ్