The Kashmir Files : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది 'ది కాశ్మీర్ ఫైల్స్'. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రం ఇది.
The Kashmir Files : ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ రంజన్ అగ్నిహోత్రి(vivek Agnihotri) దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రం ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీటి పర్యంతం అవుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు అందుకోవడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. “ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా సరికొత్త రికార్డులు, చరిత్ర సృష్టిస్తోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లలో మాత్రమే సినిమా రిలీజ్ అయ్యింది. కానీ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూల్ చేసింది.
అనుపమ ఖేర్ .. మిథున్ చక్రవర్తి .. పల్లవి జోషి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. ఇటీవలే దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి, నిర్మాతలు పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ ప్రధానిని కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మోడీ.. సినిమా పై ప్రశంసలు కురిపించారు. మోడీతో పాటు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు సినిమాను ప్రశంసించారు. అయితే ఈ సినిమా పై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా కురిపిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.?ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్.. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :