AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“రుణం తీసుకుని అయినా..సాయం కొన‌సాగిస్తా”

ఇండియాలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి… ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ పేద‌వారిని, నిమ్మ‌వ‌ర్గాల‌ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక మంది పేద‌లి ఆకలి తీర్చిన ఆయ‌న‌… ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. కాగా సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ గా మారింది. ‘నా ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంది. అయినాసరే రుణం తీసుకునైనా పేదలకు చేసే సాయం కొనసాగిస్తా. కావాలంటే నేను మళ్లీ డ‌బ్బు సంపాదించుకోగలను. ఇలాంటి విప‌త్క‌ర‌ పరిస్థితుల్లో మానవత్వంతో […]

రుణం తీసుకుని అయినా..సాయం కొన‌సాగిస్తా
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2020 | 10:12 PM

Share

ఇండియాలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి… ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ పేద‌వారిని, నిమ్మ‌వ‌ర్గాల‌ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక మంది పేద‌లి ఆకలి తీర్చిన ఆయ‌న‌… ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. కాగా సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ గా మారింది. ‘నా ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంది. అయినాసరే రుణం తీసుకునైనా పేదలకు చేసే సాయం కొనసాగిస్తా. కావాలంటే నేను మళ్లీ డ‌బ్బు సంపాదించుకోగలను. ఇలాంటి విప‌త్క‌ర‌ పరిస్థితుల్లో మానవత్వంతో ముందుకు న‌డ‌వాలి. మనమంతా కలిసి ఐక్యంగా పోరాడుదాం. అవసరాల్లో ఉన్న వారికి సాయం చేద్దాం. ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ముందడుగు’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆయన 1000 కుటుంబాలకుపైగా పేద కుటుంబాలకు సాయం చేస్తున్నారు. అంతేకాదు అనేక మందికి తన ఫాంహౌస్‌లో ఆశ్రయం క‌ల్పించి..వారికి కావాల్సిన సాయం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కుదిరినంతలో చేయాలని కోరారు. తన ఇల్లు, ఫాంహౌస్‌, నిర్మాణ సంస్థలో వ‌ర్క్ చేస్తున్న ఎంప్లాయిస్ కు ముందుగానే మూడు నెలల జీతం ఇచ్చేశానని ఇటీవల చెప్పారు.

Follow Us