Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీస్ కింగ్.. అదరగొట్టిన కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజు ఏంతంటే..

పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. కల్కి 2898 ఏడి మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన,

Kalki 2898 AD First Day Collections: బాక్సాఫీస్ కింగ్.. అదరగొట్టిన కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజు ఏంతంటే..
Prabhas Kalki 2898 Ad Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2024 | 8:13 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్ కు ఫిదా అయిన అడియన్స్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్.. ఇలా అన్ని అంశాలతో కట్టిపడేసింది కల్కి 2898 ఏడి. ఇందులో ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. కల్కి 2898 ఏడి మైండ్ బ్లోయింగ్ మూవీ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆలోచన, మేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా రావచ్చనే అంచనాల మధ్య విడుదలైన కల్కి 2898 ఏడి భారతీయ సినిమాలో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు రూ.95 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు రూ.118 కోట్లు అని తెలుస్తోంది. అలాగే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లు కలెక్షన్స్ రాగా.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది.

ఇప్పటివరకు భారతదేశంలో కేజీఎఫ్ 2 రూ.159 కోట్లు , సలార్ రూ.158 కోట్లు, లియో రూ.142 కోట్లు, సాహో రూ.130 కోట్లు, జవాన్ రూ.129 కోట్లు రాబట్టగా..ఇప్పుడు కల్కి సినిమా గ్లోబల్ ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజే రూ.223 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ ఓపెనర్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఫస్ట్ డే రూ.217 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తర్వాత ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ రూ.180 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..